: మోడీపై మనసు పారేసుకున్న కరుణానిధి
వచ్చే ఎన్నికల్లో మతతత్వ పార్టీలతో చేయి కలిపేది లేదంటూ చెబుతున్న డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి మాట తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. వరుస ప్రచార సభలతో దూసుకెళుతున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కరుణానిధి ఇప్పుడు ఆకాశానికెత్తేయడం చూస్తుంటే అది నిజమే అనిపించకమానదు. కరుణ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, మోడీ అంత కష్టజీవి మరొకరు లేరని కితాబిచ్చారు. ఆయన తనకు మంచి మిత్రుడు అని చెప్పుకున్నారు. తిరుచ్చి సభలో తాను మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని చెబితే అది బీజేపీని ఉద్దేశించి అన్నట్టా? అని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇదిలావుంటే, 'అమ్మ' జయలలిత కూడా ఇంతకుముందే మోడీ తనకు మంచి నేస్తం అని చెప్పింది. మోడీ ఎలాగూ లోక్ సభ ఎన్నికల్లో ఊపేస్తాడని, ఆయనతో చేయి కలిపితే తమ అభ్యర్థులూ గట్టెక్కుతారని తమిళ నేతలు భావిస్తున్నట్టుంది.