: కిషన్ జీ ఎన్ కౌంటర్ బాధ్యులకు 'శౌర్య చక్ర'


మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు ను ఎన్ కౌంటర్ చేసిన ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. వీరితో పాటు మరో 12 మందికి కూడా ఈ విశిష్ట పతకాన్ని అందించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

భారత్ లో పదాతి దళాలకు, సైన్యానికి ఇచ్చే విశిష్ట పతకాల్లో శౌర్య చక్ర మూడోది. కాగా, గతేడాది నియంత్రణ రేఖ వద్ద టెర్రరిస్టులను మట్టుబెట్టే క్రమంలో సహచరులను కాపాడి, తమ ప్రాణాలను త్యాగం చేసిన ఇద్దరు పంజాబ్ రెజిమెంట్ జవాన్లు రాజేశ్వర్ సింగ్, అనిల్ కుమార్ లకు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించారు. 

  • Loading...

More Telugu News