: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 శాతం డీఏ పెంచింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అలాగే 30 లక్షల పింఛనుదారులు కూడా డీఏ పెంపుతో ప్రయోజనం పొందనున్నారు. ఈపీఎఫ్ చందాదారులకు ఫించను కనీస మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.