: వస్తువులు పోయాయా.. పోలీస్ స్టేషన్ కు వెళ్లక్కర్లేదు


విలువైన వస్తువులను పోగొట్టుకుంటే.. వాటి కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరగాల్సిందే. కానీ, ఈ బాధలను తప్పించేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త సేవను ప్రారంభించారు. లాస్ట్ రిపోర్టు అనే మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని కేంద్ర హోంమంత్రి షిండే ప్రారంభించారు. స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చే పని లేకుండానే.. అదే పనిని ఈ అప్లికేషన్ ద్వారా చేయవచ్చని.. నిమిషాల్లోనే తిరుగు జవాబు వస్తుందని షిండే తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సి మాట్లాడుతూ.. పోగొట్టుకున్న వస్తువుల సమాచారంపై ఫిర్యాదు అందగానే మొబైల్ కు లేదా ఈ మెయిల్ కు ధ్రువీకరణ పంపిస్తామని.. దానిని ప్రింట్ తీసుకోవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News