: జడలు విప్పిన ర్యాగింగ్ భూతం..ఇద్దరు విద్యార్థుల సస్పెన్షన్
వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను వేధింపులకు గురి చేశారంటూ జూనియర్లు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ ఇద్దరు వైద్య విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా, ర్యాగింగ్ ఘటనలు పునరావృతమవుతుండడంతో, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్ ప్రభావితమయ్యే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.