: రాజకీయ నేతలంతా రిలయన్స్ కు అమ్ముడుపోయారా?: ఆప్
రాజకీయ పార్టీల నేతలందర్నీ రిలయన్స్ అధినేతైన ముఖేష్ అంబానీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. హైదరాబాదులో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ, కేజీ బేసిన్ ధరలపై రిలయన్స్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై 4 వేల కోట్ల రూపాయల భారం పడే గ్యాస్ ధరల పెంపు ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ గ్యాసుపై ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు. అన్ని పార్టీలు ముఖేష్ అంబానీకి అమ్ముడు పోయాయా? అంటూ నిలదీశారు.