: మీసం మెలేస్తే అంతే...!
మీసాన్ని మెలేసి సవాల్ చేసేవాళ్లని మనం చూస్తాం. మన తెలుగు హీరోలు కూడా సినిమాల్లో మీసాలు మెలేస్తారు. అయితే, ఆ మీసాల రాయుడి స్టైలే వేరు. న్యూయార్క్ నగరానికి చెందిన డిజైనర్ స్నేహితులతో పందెం కాశాడు. అతడి పేరు మైక్ అలెన్. సవాల్ కోసం మీసం, గడ్డాన్ని పెంచి ఏ, బీ, సీ, డీలు డిజైన్ చేయించుకున్నాడు. మొదట మీసం, గడ్డాన్ని ‘ఏ’ ఆకారంలో కత్తిరించుకున్నాడు, తర్వాత బీ, సీ, డీ అలా చేస్తూ పోయాడు. అయితే ఏ, బీ, సీ, డీలు పూర్తి చేసేందుకు అతగాడికి రెండేళ్లు పట్టింది. 2011లో ‘ఏ’తో ప్రారంభించిన మైక్... 2013 డిసెంబర్ నాటికి ‘జెడ్’తో పూర్తి చేశాడు.