: 1973లో తొలిసారి ఏపీలో రాష్ట్రపతి పాలన
మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. 1973లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో జైఆంధ్ర ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేయడంతో, పాలనా వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. దీంతో, అప్పట్లో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు తొలిసారి రాష్ట్రపతి పాలన కొనసాగింది.
ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడంతో మరోసారి రాష్ట్రపతి పాలన అనివార్యం అయింది. రాష్ట్ర విభజన జరిగిపోవడం, వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో, రాష్ట్రపతి పాలన వైపే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపింది.