: గెజిట్ ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది?: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వలేదని... కేవలం రాహుల్ కోసం, రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రకటించి ఇన్ని రోజులైనా ఇంకా గెజిట్ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు. సీమాంధ్రకు మేలు జరిగేలా పార్లమెంటు ఉభయసభల్లో వ్యవహరించామని చెప్పారు. ఈరోజు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమని వెల్లడించారు. 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు తెలంగాణను ఇచ్చారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. పొత్తులపై టీడీపీ పెత్తనమేమిటని ప్రశ్నించారు.