: కేధారేశ్వరుడి దర్శనం మే 4 నుంచి
చార్ ధామ్ యాత్ర ఈ ఏడాది మే 2 నుంచి ప్రారంభం కానుంది. గతేడాది ఈ యాత్రలో భాగంగానే ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి 10 వేల మంది భక్తుల ప్రాణాలు జలసమాధి అయిన విషయం తెలిసిందే. మే 2న గంగోత్రి, యుమునోత్రి, 4న కేధార్ నాథ్, 5న బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు. ఏటా శీతాకాలం ఆరంభం నుంచి ఆరు నెలల పాటు ఈ ఆలయాలను మూసివేస్తారు.