: తల్లయిన నటి భూమిక
నటి భూమిక అమ్మయింది. అందమైన బాబుకు ఈ అందాల భామ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తనే ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించింది. రెండు వారాల కిందట తనకు బాబు పుట్టినట్లు తెలిపింది. చాలా ఆనందంగా ఉందని, తనకు, భర్త భరత్ ఠాకూర్ కు జీవితంలో తమ బాబు ఆనందాలు తీసుకొచ్చాడని చెప్పింది. భూమిక ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న'లడ్డూ బాబు' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగు సమయానికే కొన్ని నెలల గర్భవతి అయిన భూమిక డెలివరీ కోసం కొంత గ్యాప్ తీసుకుంది. మళ్లీ కొన్నిరోజులకి చిత్రీకరణలో పాల్గొంది.