: శివాలయ నిర్మాణానికి ఓ ముస్లిం భూదానం
ముస్లిమే అయినా.. మానవత్వాన్ని, హిందుత్వాన్ని, సర్వమానవ సమానత్వాన్ని చాటాడు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లా.. ఉమర్ పూర్ నీవాకు చెందిన అక్లాష్ అహ్మద్. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసే అహ్మద్.. తన భూమిని శివాలయ నిర్మాణానికి దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిధుల సేకరణ బాధ్యతను కూడా తలకెత్తుకున్నాడు. శివరాత్రి అయిన నిన్న శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దీనిపై అహ్మద్ మాట్లాడుతూ.. 'మనందరం దేవుని సేవకులం. మతం ఆధారంగా మనల్ని మనం ఎందుకు విభజించుకోవడం?' అని ప్రశ్నించాడు.