: కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు
బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. దానిపై త్వరలో వివరణ ఇవ్వాలని కోరింది. గతేడాది చివర్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ విడుదల చేసిన అవినీతిపరుల జాబితాలో గడ్కరీ పేరును కూడా పేర్కొన్నారు. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గడ్కరీ కోర్టును ఆశ్రయించారు.