: నేనెక్కడికీ పారిపోవడం లేదు: సహారా అధినేత సుబ్రతోరాయ్


పోలీసులకు దొరక్కుండా తానెక్కడికీ పారిపోవడం లేదని... కోర్టు ఆదేశాలను శిరసావహిస్తానని సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాయ్ ని అరెస్టు చేయడానికి లక్నోలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన అక్కడ లేకపోవడంతో, ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన రాయ్, తాను పారిపోలేదని, వైద్యులకు చూపించుకోవడానికి కాసేపు బయటకు వెళ్లానని చెప్పుకొచ్చారు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, మార్చి మూడో తేదీవరకు ఆమెతో పాటు ఉండేలా అనుమతించాలని ఓ ప్రకటన ద్వారా సుప్రీంకోర్టును కోరారు.

  • Loading...

More Telugu News