: పదమూడేళ్ల వయస్సుకే డిగ్రీ పరీక్ష రాసిన వండర్ కిడ్
భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించారు. కేవలం పదమూడేళ్ళ వయస్సులో ఆమె డిగ్రీ పరీక్షలకు హాజరై అందర్నీ అబ్బురపరిచారు. ప్రస్తుతం నైనా బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నైనా ఈరోజు హైదరాబాద్ చింతల్ లోని రెయిన్ బో డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరైంది.
టీటీలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఈ చిన్నారి నైనా ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ఈ వండర్ కిడ్ ఎనిమిదేళ్ళకే పదవ తరగతి పరీక్షలు రాసి.. పాసై, ఔరా అనిపించడమే కాకుండా, 11 ఏళ్ళ వయస్సుకే ఇంటర్ పూర్తి చేసింది. అంతేనా, ఏకకాలంలో రెండు చేతులతో రాయడం నైనా ప్రత్యేకత. పియానో వాయించడం, పాటలు పాడడంలోనూ నైనా ప్రావీణ్యం సంపాదించింది.