: శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్పీడు పెరిగింది


దేశంలో అత్యంత వేగంగా వెళ్ళే రైలు ఇప్పటివరకు శతాబ్ది ఎక్స్ ప్రెస్సే. ప్రస్తుతం వాటి వేగం గంటకు 140 కిలోమీటర్లు కాగా, ఇకపై ఆ సూపర్ ఫాస్ట్ రైళ్ళు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళనున్నాయి. ఈ ఏడాది చివరినాటికి శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళు వేగం పుంజుకుంటాయని రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ చండీగఢ్ మార్గాల్లో శతాబ్ది రైళ్ళను 160 కిమీ వేగంతో నడపనున్నారు. ప్రస్తుతం ఆ మార్గాల్లోని ట్రాక్ లకు ఎలాంటి మార్పులు అవసరం లేదని అరుణేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ రెండు మార్గాల్లో లెవెల్ క్రాసింగ్ లను తొలగిస్తామని చెప్పారు. దశలవారీగా దేశంలోని అన్ని మార్గాల్లో శతాబ్ది రైళ్ళ స్పీడు పెంచుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News