: ఏపీలో ఇక రాష్ట్రపతి పాలనే!
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు చూపినట్టు సమాచారం. రేపటి కేబినెట్ భేటీలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం తరువాత ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్ పుంజుకునేందుకు మరింత సమయం పడుతుందని, అందుకు అధికారంలో ఉండడమే సరైన చర్య అని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానానికి చేసిన విన్నపాలను అధిష్ఠానం పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.