: వేపతో రావి చెట్టుకు ఘనంగా పెళ్లి చేశారు..!


ఆ గ్రామస్తులు వేప చెట్టుకు, రావి చెట్టుకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ పెళ్లి తంతు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల పరిధిలోని ముకుందాపురంలో జరిగింది. ఒకే చోట ఉన్న రావి చెట్టుకు, వేప చెట్టుకు వివాహం చేస్తే శుభం జరుగుతుందని అక్కడవారి నమ్మకం. గ్రామంలో పెళ్లి కాని యువతీ యువకులు రావి, వేప చెట్లకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే తొందరగా ఓ ఇంటివారవుతారట. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని వారు నమ్మకంతో చెప్పారు. నమ్మకం గురించి పక్కన పెడితే... ఔషధ గుణాలున్న ఆ చెట్ల చుట్టూ తిరిగితే ఆరోగ్యానికి మంచిదే కదా!

  • Loading...

More Telugu News