: టెట్ ఇప్పట్లో లేనట్టే


ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఇప్పట్లో లేనట్టేనని అధికారులు స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో టెట్ నిర్వహణ అసాధ్యమని అధికారులు తేల్చేశారు. అయితే, నిరుద్యోగుల నుంచి టెట్ పరీక్ష రుసుము పేరిట వసూలు చేసిన సుమారు 10 కోట్ల రూపాయలతో, రాష్ట్ర విభజన తర్వాత, ఆయా ప్రాంతాల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం ఆధారంగా టెట్ నిర్వహించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

గత ఏడాది జూలై 10న విడుదలైన టెట్ నోటిఫికేషన్ కు సంబంధించి మూడుసార్లు పరీక్ష తేదీలు ఖరారై చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. చివరగా ఫిబ్రవరి 9న జరగాల్సిన టెట్ పరీక్ష ఏపీఎన్జీవోల సమ్మె కారణంగా వాయిదా పడింది. టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పట్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం లేకపోవడంతో వీరంతా నిరాశ చెందుతున్నారు.

  • Loading...

More Telugu News