: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న జర్దారీ


పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' (పీపీపీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో పార్టీ అధినేతగా కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ నియమితులయ్యారు. తమ పార్టీ అధినేతగా బిలావల్ ను ఎన్నుకున్నట్లు జర్దారీ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. అంతకుముందు పార్టీ పదవినుంచి తక్షణమే తప్పుకోవాలంటూ జర్దారీని లాహోర్ హైకోర్టు ఒత్తిడి చేసింది.

అధ్యక్షుడిగా వున్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ వ్యవహారాలలో నిమగ్నం కారాదనీ, అందరినీ సమ దృష్టితో చూడాల్సిన బాధ్యత అధ్యక్షుడిపై ఉందనీ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జర్దారీ పార్టీ నుంచి సంబంధాలను తెంచుకున్నారు. 

  • Loading...

More Telugu News