: కిరణ్ కొత్త పార్టీ ప్రభావం అంతంత మాత్రమే: బొత్స ఝాన్సీ
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా, దాని ప్రభావమేమీ ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఆమె బొబ్బిలిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉన్నదని అన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరుపున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తు పెట్టుకుంటేనే ఆయనకు మనుగడ ఉంటుందని ఆమె హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాల్తేరును రైల్వే జోన్ గా చేయాలని డిమాండ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అన్ని సౌకర్యాలున్న విశాఖను రాజధానిగా చేయాలని, సీమాంధ్ర ప్రాంతానికి సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు.