: యనుకోవిచ్ కు ఆశ్రయమిస్తాం: రష్యా
ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు యనుకోవిచ్ తమ దేశానికి వస్తే ఆశ్రయం కల్పిస్తామని రష్యా ప్రకటించింది. యనుకోవిచ్ కు వ్యతిరేకంగా ఉక్రెయిన్ లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో, కొంత కాలం క్రితం ఆయన దేశం విడిచి పారిపోయారు. అనంతరం ఉక్రెయిన్ లో ప్రభుత్వం ఏర్పడింది. అయితే దీనిని పశ్చిమదేశాలు గుర్తించగా, రష్యా గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడికి ఆశ్రయం కల్పిస్తామని రష్యా ప్రకటించడం ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపనుంది.