: మొదలైన హజ్ యాత్ర దరఖాస్తుల ప్రక్రియ
ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాదులోని హజ్ హౌసులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హజ్ యాత్రికుల కోసం ఈ ఏడాది రెండు కోట్ల రూపాయల రాయితీని ప్రభుత్వం భరించనుంది. మరోవైపు హజ్ హౌస్ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ఏడాది కోటాలో ఐదు వేలమంది హజ్ యాత్రకు వెళ్లవచ్చని అధికారుల అంచనా.