: ఫాంహౌస్ లో ముఖ్య నేతలతో భేటీ అయిన కేసీఆర్
మెదక్ జిల్లాలో ఉన్న తన ఫాంహౌస్ లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మార్చి ఒకటిన జరగనున్న పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో చర్చించాల్సిన అంశాలపై వీరంతా సమాలోచనలు జరుపుతున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేయడమా? లేక పొత్తు పెట్టుకోవడమా? అనే విషయంపై కూడా దృష్టి సారించారు.