: కోట్లాలో సచిన్ సోదరుడు.. మాస్టర్ వీడ్కోలుపై ఊహాగానాలు!


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. ఆటకు వీడ్కోలు పలికేందుకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది! ఎందుకంటే, ఎన్నడూ సచిన్ ఆడిన మ్యాచ్ లకు హాజరు కాని అతని సోదరుడు అజిత్ టెండూల్కర్ ఆశ్చర్యకరంగా కోట్లాలో దర్శనమిచ్చాడు.

దీంతో అందర్లోనూ ఒకటే ఉత్కంఠ! 'మాస్టర్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్ట్' సచిన్ కిది చివరి మ్యాచేనా? అని అభిమానుల్లో చిరు నైరాశ్యం! ఈ టెస్టుతో సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే వేళ, అజిత్ తన తమ్ముడి చెంత ఉండాలని భావించాడేమో.. అని క్రికెట్ పండితులు తమదైన రీతిలో భాష్యం చెబుతున్నారు. బాల్యంలో సచిన్ కు క్రికెట్ ఏబీసీడీలు నేర్పింది అజిత్ కావడం విశేషం.

ఇదిలావుంటే, ఆసీస్ తో నాలుగో టెస్టు సచిన్ కెరీర్లో 197వది. కొద్ది నెలల్లో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. ఆ సిరీస్ లో సచిన్  ఆడితే 200 టెస్టుల రికార్డు సాకారం అవుతుంది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ క్రికెట్ కు సచిన్ వీడ్కోలు ప్రకటన ఇప్పట్లో ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. 

  • Loading...

More Telugu News