: ఫేస్ బుక్ లో అసత్య ఆరోపణలతో విద్యార్థికి 50 వేలు జరిమానా
తమ కళాశాల ప్రిన్సిపాల్ పై ఫేస్ బుక్ లో అసత్య ఆరోపణలు చేసిన ఒక విద్యార్థికి గ్రామ న్యాయస్థానం 50 వేల రూపాయల జరిమానా విధించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈస్ట్ సియాంగ్ జిల్లా జవహర్ లాల్ నెహ్రూ కళాశాలలో బీఎస్సీ మొదటి ఏడాది చదువుతున్న మిబాం లిబాంగ్ అనే విద్యార్థి ప్రిన్సిపాల్ పై పలు ఆరోపణలు చేశాడు. అవన్నీ నిరాధారమని తేల్చిన గ్రామ న్యాయస్థానం విద్యార్థికి 50 వేల రూపాయల జరిమానా విధించింది.