: అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే'కు నటుడు సూర్య ప్రచారం


దేశంలోని సున్నితమైన సమస్యలను తీసుకుని నటుడు అమీర్ ఖాన్ రూపొందిస్తున్న కార్యక్రమం 'సత్యమేవ జయతే'. ఈ కార్యక్రమం రెండో సీజన్ అంటే 'సత్యమేవ జయతే 2' మార్చి మొదటివారం నుంచి స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారం కానుంది. ఒక్క హిందీలోనే కాక పలు భాషల్లోనూ డబ్ అయి ప్రేక్షకులను అలరించనుంది. ఈ మేరకు ఈ షోకు పలువురు సెలబ్రిటీల చేత ప్రమోట్ చేయిస్తున్నారు. దక్షిణాదిన భారీ అభిమానుల ఆదరణ ఉన్న నటుడు సూర్య చేత తెలుగు, తమిళ భాషల్లో ప్రచారం చేయిస్తున్నట్లు అమీర్ తెలిపాడు. అటు మలయాళంలో మోహన్ లాల్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడట. ఇక మహారాష్ట్రలో తాను ప్రచారం చేస్తానని అమీర్ వివరించాడు. దీని ద్వారా దేశంలోని ఎక్కువమంది ప్రేక్షకులను చేరవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News