: ఎన్నికలకు మేము సిద్దం: డీజీపీ ప్రసాదరావు


రాష్ట్ర విభజన నేపథ్యంలో, పోలీసు శాఖ విభజనకు సంబంధించి కేంద్ర హోం శాఖ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు తామంతా సర్వసన్నద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 35 వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని డీజీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News