: అక్కడ ఆస్తిపన్ను బకాయి పడ్డ వారికి స్పెషల్ ఆఫర్
ఆస్తిపన్ను బకాయి పడ్డ వారికి హర్యానా ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. హర్యానా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయి పడ్డ వారు మార్చి 31లోపు కనుక పన్ను చెల్లిస్తే... 30 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో హర్యానా సీఎం భూపేందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చారని చండీఘర్ వాసులు అనుకుంటున్నారు.