: నూతన కణాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
శాస్త్రరంగంలో మరో సరికొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంది. ఎలక్ట్రాన్, ప్రొటాన్ తరహాలో మరో సూక్ష్మ కణ సమూహాన్ని కనుగొన్నట్టు జర్మన్ పరిశోధకులు వెల్లడించారు. ఘనపదార్ధాల్లో ఉండే ఈ కణాలు విచిత్రమైనవని తెలిపారు. ఇవి ద్రవరూప లక్షణాలను కలిగి ఉన్నాయని వివరించారు. ఈ కొత్త కణానికి 'డ్రాప్లెటాన్' అని నామకరణం చేశారు. తమ నూతన ఆవిష్కరణ ద్వారా పరమాణు పట్టికలో మరో కొత్త పేరు చేరిందని పరిశోధనలో పాలుపంచుకున్న మాకిల్లో కిరా తెలిపారు. ఒక్కో డ్రాప్లెటాన్ ఐదు ఎలక్ట్రాన్లు, ఐదు క్వాంటమ్ బిలాలను కలిగి ఉంటుందని కిరా వెల్లడించారు.