: 715 కొత్త గ్రహాలను కనిపెట్టిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్తగా 715 గ్రహాలను కనుగొన్నట్టు ప్రకటించింది. సౌరవ్యవస్థకు వెలుపల 715 గ్రహాల ఉనికిని నాసా ధృవీకరించింది. నాసాకి చెందిన ఎక్సో ప్లానెట్ ఎక్స్ ప్లొరేషన్ ప్రోగ్రాం శాస్త్రవేత్త డగ్లస్ హడ్గిన్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందుకు కెప్లర్ టెలిస్కోప్ ఉపయోగించినట్టు ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు నాసా కనుగొన్న గ్రహాల సంఖ్య 1,700కి చేరింది. నాసా కనుగొన్న 715 కొత్త గ్రహాలన్నీ దాదాపు భూమి అంత పరిమాణంలోనే ఉన్నాయని, ఒక్కో నక్షత్రం చుట్టూ కొన్ని గ్రహాల చొప్పున తిరుగుతున్నాయని ఆయన చెప్పారు.