: సజావుగా నడవని వైనం.. సభ సోమవారానికి వాయిదా
సడక్ బంద్ అరెస్టుల అంశం ఇవాళ శాసనసభ సమావేశాల్లో కీలక భూమిక పోషించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. టీజేఏసీ నేతల అరెస్టుల అంశం మీద స్వపక్ష, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. సడక్ బంద్ సందర్భంలో తెలంగాణ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి రెండుమార్లు సభవాయిదాకు కారణమయ్యారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, వామపక్షాలు, ఎంఐఎం, లోక్ సత్తా నేతలు ఆయా అంశాలమీద ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి దీటుగా సీఎంతో పాటు హోంమంత్రి కూడా చర్చకు సమాధానమిచ్చారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, వామపక్షాలు, ఎంఐఎం, లోక్ సత్తా నేతలు ఆయా అంశాలమీద ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి దీటుగా సీఎంతో పాటు హోంమంత్రి కూడా చర్చకు సమాధానమిచ్చారు.
అయితే సడక్ బంద్ అరెస్టులకు సంబంధించి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళన కొనసాగించటంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.