: బంగ్లాతో మ్యాచ్ పై రహానే కామెంట్


బంగ్లాదేశ్ జట్టుతో నిన్న ఫతుల్లాలో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ (136) కెప్టెన్ ఇన్నింగ్స్, రహానే (73) క్లాస్ టచ్ ప్రదర్శించడంతో టీమిండియా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ పై రహానే మాట్లాడుతూ, ఈ విజయం తమకు చాలా ముఖ్యమైనదని తెలిపాడు. ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో, బంగ్లాపై గెలుపుతో మళ్ళీ ఊపందుకున్నామని వివరించాడు. 'మేము ఈ మ్యాచ్ లో నాణ్యమైన క్రికెట్ ఆడాం. చివరి ఐదు ఓవర్లలో బౌలర్లు బంగ్లా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసి పరుగులను నిరోధించారు. క్రెడిటంతా జట్టు మొత్తానికి ఆపాదించాలి. ముఖ్యంగా కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు' అని చెప్పుకొచ్చాడు. ఇక జట్టు విజయంలో తానూ పాలుపంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడీ ముంబైకర్.

  • Loading...

More Telugu News