: కేసీఆర్ దళితుడ్ని వారి వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదు: అరవింద్ రెడ్డి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆ పార్టీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్, సోనియా, రాహుల్ గాంధీల వద్దకు ఒక్క దళితుడ్ని కూడా ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం ఆలోచించే కేసీఆర్, తెలంగాణలోని 84 అసెంబ్లీ స్థానాలకు సరైన అభ్యర్థులను కూడా ఎంపిక చేయలేడని విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అరవింద్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నర్మాణం టీఆర్ఎస్ కు సాధ్యం కాదని తెలిపారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసి కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.