: మాఫియాడాన్ తల్లి అంత్యక్రియలకు వెయ్యిమంది హాజరు... అతను తప్ప!


ముంబయిలో ఒకప్పుడు చోటా రాజన్ పేరు చెబితే హడల్! దావూద్ ఇబ్రహీంకు పోటీగా అధోజగత్తును శాసించిన ఈ మాఫియా డాన్ చివరికి తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని దుస్థితిని ఎదుర్కొన్నాడు. రాజన్ తల్లి లక్ష్మి నిఖల్జీ చెంబూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న ఉదయం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలకు దాదాపు 1000 మందికిపైగా హాజరయ్యారు. రాజన్ విధేయులు, రాజకీయాల్లో ఉన్న అతని సోదరుడు దీపక్, అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందరూ వచ్చినా రాజన్ మాత్రం కేసుల భయంతో భారత్ లో అడుగుపెట్టేందుకు సాహసించలేకపోయాడు.

ప్రస్తుతం చోటారాజన్ మలేసియాలోగానీ, థాయ్ లాండ్ లోకాని ఉంటాడని భావిస్తున్నారు. 2011లో సోదరుడు ప్రకాశ్ పుణేలో హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయినప్పుడు కూడా రాజన్ చివరిచూపులకు నోచుకోలేదు. రాజన్ ఉదంతంపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ... 'సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మాఫియా నేతలు చెల్లిస్తున్న మూల్యమిది' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News