: మహిళల జోలికొస్తే ఈ రోబో తాట తీస్తుంది
మహిళలపై వేధింపుల నిరోధానికి జపాన్ పోలీసులు ఒక కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టారు. రైళ్లలో ప్రయాణికుల రక్షణ కోసం రోబో పోలీసులను రంగంలోకి దింపారు. చేతిలో రెండు తుపాకులతో కండలు తిరిగిన మనిషిలా రోబో ఆరివీర భయంకర పోజులో రెడీగా ఉంటుంది. ఎవరైనా మహిళలను వేధిస్తే.. దీని చేతిలో బుక్కయిపోవాల్సిందే. చట్టాలను ఉల్లంఘించే వారిని అరెస్ట్ చేసే అధికారం కూడా ఈ రోబోలకు ఉంది.