: మీరు ‘శయన శివుడి’ని ఎప్పుడైనా చూశారా?


ఆదిశేషువుపై విష్ణుమూర్తి శయనిస్తాడు. కానీ, శివుడు మాత్రం ఎప్పుడూ తపో ముద్రలో ప్రశాంతంగా కూర్చుంటాడు. మనకు ఎక్కువగా కనిపించే భంగిమలివే! కానీ... ప్రపంచంలో ఒక్కచోట మాత్రం తల్లి ఒడిలో నిద్రిస్తున్న శివుడిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ శయన శివుడి ఆలయం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న చిన్న గ్రామమైన సురుటిపల్లిలో పళ్లికొండేశ్వరాలయం ఉంది. పుత్తూరు నుంచి చెన్నై వెళ్లే బస్సులు సురుటిపల్లిలో ఆగుతాయి. చిన్న గ్రామం కావడంతో అక్కడ వసతి వగైరా సదుపాయాలేమీ లేవు.

అక్కడ శివుడు తల్లి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. 19 అడుగుల పొడవున్న... సర్వమంగళాదేవి ఒడిలో విశ్రమిస్తూ చుట్టూ బ్రహ్మ, విష్ణు, నారదుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, మార్కండేయుడు, కుబేరుడు, విశ్వామిత్ర, అగస్త్య, పులస్త్య, వాల్మీకి మహర్షులతో భక్తులకు మహదేవుడు దర్శనమిస్తాడు.

ఇంత అద్భుతమైన పళ్లికొండేశ్వరాలయం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష వేళల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రవేశించిన భక్తులు ముందు మరగతాంబిక, వాల్మీకేశ్వరులను దర్శించుకోవాలని ఆలయ పూజారులు చెప్పారు.

  • Loading...

More Telugu News