: సమైక్య పోరాటంలో టీడీపీ ఓడిపోయింది...క్షమించండి!: నన్నపనేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేసిన పోరాటంలో టీడీపీ ఓటమిపాలైందని, అందుకు సీమాంధ్ర ప్రజలు క్షమించాలని ఆ పార్టీ నేత నన్నపనేని రాజకుమారి తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించి దుస్సాంప్రదాయన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని ఆమె మండిపడ్డారు.