: మోడీపై ఖుర్షీద్ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'నపుంసకుడు' అంటూ తాజాగా కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన విమర్శలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇటువంటి భాషను తాను ప్రొత్సహించనని పరోక్షంగా ఖుర్షీద్ కు చురకలంటించారు. వాటిపై మీడియా ఈ రోజు అడగడంతో రాహుల్ పైవిధంగా స్పందించారు. 2002లో గుజరాత్ లో జరిగిన మత కల్లోలాలను మోడీ ఎందుకు అరికట్టలేకపోయారని ఇటీవల ఓ ర్యాలీలో పాల్గొన్న ఖుర్షీద్ ప్రశ్నించారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే బీజేపీ ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించింది కూడా.

  • Loading...

More Telugu News