: రాష్ట్రపతి పాలనపై సోనియాతో షిండే, డిగ్గీరాజా భేటీ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు. వీరు ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనేదానిపై వీరు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.