: ఆ బంగారం దుకాణంలో ఆరు కిలోల వెండిని దోచేశారు
ఆ బంగారం దుకాణంలోకి ప్రవేశించిన ఆగంతుకులు ఆభరణాలు దొరకకపోవడంతో, ఆరు కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. ఈరోజు ఉదయం దొంగతనం జరిగినట్లు యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ సమీపంలో ఉన్న కార్తీక్ జ్యూయలర్స్ లో ఈ చోరీ జరిగింది. అంతకు ముందు దుండగులు పాకాల రహదారిపై నున్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. అయితే అక్కడ నగదు, ఇక్కడ బంగారం దొరక్కపోవడంతో వెండిని ఎత్తుకెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.