: మోడీ... మీసం, రాహుల్... తోక!
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీలను విచిత్రంగా అభివర్ణించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. మోడీ మీసంలాంటి వారైతే... రాహుల్ తోకలాంటి వారని పేర్కొన్నారు. (మీసం పురుషత్వానికి చిహ్నమైతే, తోకలోని వెంట్రుకలు ఈగలు తోలుకోవడానికి తప్ప దేనికీ పనికిరావని చౌహాన్ అభిప్రాయం). నీముచ్ లో ఓ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'మోడీ ఎక్కడ...! రాహుల్ ఎక్కడ...!' అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య పోలికేలేదని తేల్చేశారు. క్యాబినెట్ లో మంత్రి పదవికి తీసుకోవడానికి భయపడిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడట! అని రాహుల్ ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. భావి ప్రధాని మోడీయేనని ఈ బీజేపీ ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.