: ఎడమొహం పెడ మొహంగా చిరు, కల్యాణ్
తెలుగు సినీ ప్రముఖ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్ ల మధ్య విభేదాలు నిజమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిచయం సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ కల్యాణ్, చిరంజీవి మాట్లాడుకోకుండా ఉండడం, మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోవడం అభిమానుల ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దగ్గర్నుంచి వారిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.