: అవసరం లేని చట్టాలన్నీ తొలగిస్తాం: మోడీ


బీజేపీ అధికారంలోకి వస్తే వ్యర్థ చట్టాలన్నీ తొలగిస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో స్మార్ట్ సిటీస్, బుల్లెట్ ట్రైన్స్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రక్షణ పరికరాల దిగుమతిపై ఆధారపడడం తగ్గించి సొంతంగా తయారుచేయగల సామర్థ్యం సాధించాలని ఆయన అన్నారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాలను బలోపేతం చేస్తామని తెలిపారు. వ్యవసాయాధారిత పరిశ్రమలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News