: రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. స్టేషన్లో యువతిపై కన్ను
రైల్వేలో పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల ముసలాడు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాయమాటలతో ఓ యువతిని అపహరించే ప్రయత్నం చేశాడు. విజయవాడకు చెందిన యువతి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి సొంత ఊరు వెళ్లేందుకు బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఇంతలో రైల్వే విశ్రాంత ఉద్యోగి పరంజ్యోతి యువతి వద్దకు వచ్చి తనతో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.