: 63 శాతం భారతీయులు బీజేపీని కోరుకుంటున్నారు: అమెరికా సర్వే సంస్థ


రానున్న లోక్ సభ ఎన్నికలపై అమెరికాకు చెందిన వ్యూ రీసర్చ్ సెంటర్ సర్వే నిర్వహించింది. డిసెంబరు-జనవరిలో చేపట్టిన ఈ సర్వేలో తేలిన అంశాలు యూపీఏ పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ సర్వేలో రాహుల్ కంటే మోడీకే ప్రజాదరణ ఎక్కువని తేలింది. 63 శాతం మంది భారతీయులు బీజేపీని కోరుకుంటున్నారని... 70 శాతం మంది ప్రజలు యూపీఏను తిరస్కరిస్తున్నారని వెల్లడయింది. ఉద్యోగ, ఉపాధి కల్పన బీజేపీతోనే సాధ్యమని 58 శాతం ప్రజలు భావిస్తున్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలలో బీజీపీకి అత్యధిక ప్రజాదరణ ఉందని తేలింది. తీవ్రవాదం, అవినీతి నియంత్రణ బీజీపీతోనే సాధ్యమని అత్యధిక భారతీయులు భావిస్తున్నారు. దేశంలో ఐదింట మూడొంతుల మంది ప్రజలు మోడీ వైపు మొగ్గుచూపుతున్నారని సర్వేలో తేలింది.

  • Loading...

More Telugu News