: బంగ్లాపై భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్ ను మన కుర్రాళ్లు చిత్తు చేశారు. ఆసియాకప్ లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్ లోని ఫతుల్లాలో జరిగిన వండే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలివుండగానే 280 పరుగులు చేసి, 6 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 136 పరుగులు చేసిన కోహ్లీకి, 73 పరుగులు చేసిన రహానే అండగా నిలిచాడు.