: నాకు ప్రజలే హైకమాండ్: చంద్రబాబు
కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఆదేశాలమేరకు పనిచేస్తారని, వారికి హైకమాండే సర్వస్వమని చంద్రబాబు చెప్పారు. కానీ, తనకు ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మలిచేవరకు నిద్రపోనని చెప్పారు. తనకు పదవీకాంక్ష లేదని, అయితే, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చంద్రబాబు కోరారు. తన కుటుంబానికి ఎలాంటి ఉపాధి అవసరం లేదని చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ తెలుగుజాతిని ప్రపంచపటంలో నిలబెడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.