: బీజేపీ న్యాయం చేస్తుందని ఆశించాను, కానీ...: బాబు
రాష్ట్ర విభజన అంశంలో బీజేపీ తెలుగువాళ్ళకు న్యాయం చేస్తుందని ఎంతో ఆశించానని చంద్రబాబు చెప్పారు. విజయనగరం సభలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా చీలుస్తున్నారని మోడీ కూడా చాలాసార్లు అన్నాడని గుర్తు చేశారు. కానీ, చివరకొచ్చేసరికి బీజేపీ పార్లమెంటులో ఈ విషయంపై పోరాడకుండా మిన్నకుండిపోయిందని విమర్శించారు.