: జగన్ వస్తే చంచల్ గూడ జైలులాంటి రాజధాని నిర్మిస్తాడు: బాబు


చంద్రబాబు తన ప్రసంగంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పైనా విమర్శలు రువ్వారు. జగన్ అధికారంలోకి వస్తే చంచల్ గూడ జైలు లాంటి రాజధాని నిర్మిస్తాడని ఎద్దేవా చేశారు. రాజధానిని కట్టే సత్తా వైఎస్సార్సీపీకి లేదన్నారు. హైదరాబాద్ ను తలదన్నే రాజధాని టీడీపీతోనే సాధ్యమని బాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సీమాంధ్రను చైనా, దక్షిణ కొరియా స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ నూ స్మరించుకున్నారు చంద్రబాబు. కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ స్థాయికి దింపిన ఘనత ఎన్టీఆర్ దే అని నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News